India Corona: ఒక్కరోజే 10 వేల కరోనా కొత్త కేసులు..!

భారత్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

Update: 2023-04-13 06:30 GMT

India Corona: ఒక్కరోజే 10 వేల కరోనా కొత్త కేసులు..!

India Corona: భారత్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 230 రోజుల అత్యధికానికి చేరాయి. కొత్తగా 10వేల,158 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ముందురోజు కంటే 30 శాతం మేర అధికంగా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.42శాతానికి చేరింది. వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో పాజిటివ్ కేసులు 44వేల, 998కి చేరాయి. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే... దేశంలో కొవిడ్‌ ఎండమిక్‌ దశకు చేరుకుందని అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ క్రమంలో మరో 10-12 రోజులపాటు కేసుల ఉద్ధృతి కొనసాగుతుందని.. ఆ తరువాత తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నాయి. 

Tags:    

Similar News