Corona Cases in India: భారీ స్థాయిలో పెరిగిన కొత్త కేసులు.. ఐదు నెలల తర్వాత ఇదే ప్రథమం..!
Corona Cases in India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది.
Corona Cases in India: భారీ స్థాయిలో పెరిగిన కొత్త కేసులు.. ఐదు నెలల తర్వాత ఇదే ప్రథమం..!
Corona Cases in India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా భారీ స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రెండు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు 1లక్ష 42వేల 497 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2వేల 151 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి.
కాగా గత ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్ 28వ తేదీన 2వేల 208 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11వేల 903కు పెరిగింది. నిన్న కరోనాతో మహారాష్ట్రలో ముగ్గురు, కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు చొప్పున మొత్తం ఏడుగురు మృతి చెందారు. కాగా కరోనా టెస్టులు పెంచాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది.