China: భారత్‌పై మరోసారి విషం కక్కిన డ్రాగన్ కంట్రీ

China: మరోసారి డ్రాగన్ కంట్రీ డర్టీ మెంటాలిటీని బయటపెట్టింది.

Update: 2021-10-13 14:30 GMT

China: భారత్‌పై మరోసారి విషం కక్కిన డ్రాగన్ కంట్రీ

China: మరోసారి డ్రాగన్ కంట్రీ డర్టీ మెంటాలిటీని బయటపెట్టింది. వీలు చిక్కినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతున్న చైనా తాజాగా భారత ఉపరాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్‌ పర్యటనను తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిందని కుట్రపూరిత ఆరోపణలు చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను తాము గుర్తించడం లేదని, తమ ఆందోళనలను భారత్ గౌరవించాలని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ఇంకాస్త ముందుకెళ్లి సరిహద్దు సమస్య పెద్దదయ్యేలా చూడొద్దంటూ హద్దు మీరి వ్యాఖ్యానించింది.

అయితే, డ్రాగన్ కంట్రీ కామెంట్లకు భారత విదేశాంగ శాఖ అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగం అని, అరుణాచల్ ప్రదేశ్ సందర్శనకు అభ్యంతరం చెప్పడమేంటని ఫైర్ అయింది. సరిహద్దులో పరిస్థితులు మార్చేందుకు డ్రాగన్ ఏకపక్ష ప్రయత్నం చేస్తోందని భారత్ వ్యాఖ్యానించింది. అదే సమయంలో చైనా కారణంగానే ఎల్‌ఏసీ వెంబడి వివాదాలని గుర్తు చేసింది. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రొటోకాల్‌కు చైనా కట్టుబడి ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. ఇప్పటికైనా లడాఖ్‌లో మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికింది.

Tags:    

Similar News