India-Pakistan: భారత్ తో పెట్టుకుంటే ఏమౌతుందో అర్థమైందా? నేడు అఖిల పక్షం భేటీ
India-Pakistan: భారత్ తో పెట్టుకుంటే ఏమౌతుందో అర్థమైందా? నేడు అఖిల పక్షం భేటీ
India-Pakistan: భారత్ పేరు వింటేనే పాక్ వెన్నులో వణుకు పుట్టేలా ఆపరేషన్ సింధూర్ ను ప్రయోగించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ..ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడులు చేస్తూ విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈదాడిలో 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో పాకిస్థానీలు భారత్ పేరు వెంటేనే వణికిపోతున్నారు. యుద్ధభయంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ..భారత్ ఎక్కడ దాడి చేస్తుందోనన్న ఆందోళనతో బిక్కు బిక్కు మంటోంది.
భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో మరోసారి తమ శక్తియుక్తులను ప్రపంచానికి చాటిచెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న సైన్యం..పాక్ కు ముచ్చెమటలు పట్టించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారత్ తర్వాత ప్లాన్ ఏంటన్న ఉత్కంఠ నెలకొంది. అయితే బోర్డర్ లో మాత్రం పాక్ కవ్వింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పాక్ కాల్పులను భారత ఆర్మీ తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఓ కీలక ప్రకటన చేశారు. భారత్ కు యుద్ధం చేసే ఆలోచన లేదని...కానీ కవ్వింపు చర్యలను తొక్కిపడేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇదెలా ఉండగా నేడు ఉదయం 11 గంటలకు అఖిలపక్షం భేటీ కానుంది. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ కానుంది. పార్లమెంట్ కాంప్లెక్స్ లోని పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ వివరాలతోపాటు ..భారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్దత విషయాలను అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించే అవకాశం ఉంది.