Pakistan: పాక్ కు మరో ఎదురుదెబ్బ..14 మంది సైనికులు హతం

Pakistan: పాక్ కు మరో ఎదురుదెబ్బ..14 మంది సైనికులు హతం
x
Highlights

Pakistan: పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. భారత్ ఓ వైపు మెరుపు దాడులు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా రెచ్చిపోయింది....

Pakistan: పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. భారత్ ఓ వైపు మెరుపు దాడులు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా రెచ్చిపోయింది. పాకిస్తాన్ ను దెబ్బమీద దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అనుకున్నట్లుగానే తాజాగా ఎటాక్ చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దేశానికి చెందిన 14 మంది సైనికులను హతమార్చింది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.

తాజాగా పాక్ ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్ తో ఐఈడీ బాంబును పేల్చింది. ఈ నేపథ్యంలో ఏకంగా 14 మంది పాక్ సైనికులు మరణించారు. ముచ్ కుంద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు నేషనల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. బుధవారం అర్థరాత్రి తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్రమూకలు ఉన్న 9 స్థావరాలపై భారత్ అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బకు 100కు పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం.

జమ్మూకశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణకాండకు ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది భారత ఆర్మీ. ఇక తాజాగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఎటాక్ చేసింది. దీంతో పాకిస్తాన్ దేశం గజగజా వణికిపోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories