తొలి విడతలో 21 రోజులు.. రెండో విడతలో 19 రోజులు..

Update: 2020-04-14 07:55 GMT

అందరూ ఊహించినట్టే దేశంలో మరింత కాలం లాక్‌డౌన్ కొనసాగనుంది. మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రజల ప్రాణాలతో పోలిస్తే మరేదీ ముఖ్యం కాదన్నారు. దీంతో మరో 19 రోజుల పాటు దేశం లాక్ డౌన్ లోనే ఉండనుంది.

తొలి విడతలో 21 రోజులు. రెండో విడతలో 19 రోజులు. మే 3 వరకు కొనసాగనున్న లాక్ డౌన్

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని మోడీ. దేశంలో కఠిన చర్యలు తీసుకున్నా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని ఈ విషయంపై రాష్ట్రాలతో చర్చించి పొడిగింపు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక దృష్టితో చూస్తే లాక్ డౌన్ తో నష్టమే కానీ దేశ ప్రజల జీవితాలతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ ముఖ్యం కాదన్నారు. ఏప్రిల్ 20 వరకు దేశంలో కఠిన ఆంక్షలు తప్పవని ప్రజలు సహకరించాలని కోరారు.

ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఎదుర్కొంటోన్న పరిస్థితులను చూస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు మోడీ. 5 వందల కేసులు ఉన్నప్పుడే 21 రోజుల లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేసి కరోనాను ఎదుర్కోగలిగామన్నారు. ముందస్తుగా ప్రణాళికలు రూపొందించి లాక్ డౌన్ విధించకపోతే పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఒక్కతాటిపై ఉందని కష్టాలు భరించి దేశ రక్షణకు సహకరిస్తోన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో కరోనా మరణాలు పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుందన్న ప్రధాని మోడీ హాట్ స్పాట్లపై మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త హాట్ స్పాట్లు వస్తే చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయన్నారు. షరతులతో కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చామన్న మోడీ నిబంధనలు ఉల్లంఘిస్తే మినహాయింపులు ఉపసంహరిస్తామన్నారు.

ఇక లాక్ డౌన్ గైడ్ లైన్స్ ను బుధవారం విడుదల చేస్తామన్న ప్రధాని రైతులు, దినసరి కూలీలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ధేశంలో కొత్త వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, హాస్పిటళ్లో పడకల సామర్థ్యం పెంచినట్లు తెలిపారు. కొత్తగా 6 వందల హాస్పిటల్స్ కొవిడ్ చికిత్సల కోసం పనిచేస్తుందన్నారు. వేక్సిన్ తయారీ కోసం శాస్త్రవేత్తల్ని ప్రోత్సహిస్తున్నామన్నామని ప్రధాని మోడీ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేశారు ప్రధాని. కరోనాపై పోరాటంలో దేశ ఐక్యతను చాటడమే అంబేద్కర్ కు ఇచ్చే ఘన నివాళి అన్నారు.

Tags:    

Similar News