Operation Sindoor: పాక్ చర్యలను తిప్పి కొడుతోన్న భారత్.. లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం..!

Operation Sindoor: భారత్‌ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2025-05-08 11:02 GMT

Operation Sindoor: పాక్ చర్యలను తిప్పి కొడుతోన్న భారత్.. లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం..!

Operation Sindoor: భారత్‌ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నించిన పాక్ కు చుక్కెదురైంది. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్థాన్‌.. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు ప్రయత్నించింది. అవంతిపుర, శ్రీనగర్‌, జమ్మూ, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌, కపుర్తలా, జలంధర్‌, అదామ్‌పుర్‌, భఠిండా, చండీగఢ్‌, నాల్‌, ఫలోడి, భుజ్‌ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ UAS గ్రిడ్‌, గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు మన రక్షణశాఖ తెలిపింది.

పాక్ దాడులకు రుజువుగా దాడులకు సంబంధించిన శకలాలను ఆ ప్రాంతాల నుంచి సేకరిస్తున్నారు. భారత్‌ ప్రతీకార దాడుల్లో లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ధ్వంసం అయ్యింది. మరోవైపు నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ.. పాకిస్థాన్‌ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, మెంధార్‌, పూంచ్‌, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మెర్టార్లు, భారీ ఫిరంగులతో దాడులు చేస్తోంది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 16 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు.

జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ తో పాటు భారత్ లోని పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్.. మిస్సైళ్లను ప్రయోగించింది. పాక్ చర్యలతో భారత్‌ ప్రతీకార దాడులకు దిగింది. తిరిగి పాక్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది భారత్. దాడులు, ప్రతిదాడుల విషయాన్ని భారత్ ధృవీకరించింది. పాకిస్తాన్ క్షిపణి రక్షణ వ్యవస్థపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. లాహోర్‌లోని ఎయిర్‌డిఫెన్స్‌ సిస్టమ్‌ను నిర్వీర్యం చేసినట్లు భారత్‌ ప్రకటించింది. దాడులకు తెగబడుతున్న పాక్‌కు బుద్ధి చెబుతామని భారత్ మరోసారి హెచ్చరించింది.

Tags:    

Similar News