India vs China: పాక్‌తో చెయ్యి కలుపుతున్న చైనా.. ఇండియా తర్వాత చేయనుంది ఇదే!

India vs China: పాక్‌తో చెయ్యి కలుపుతున్న చైనా.. ఇండియా తర్వాత చేయనుంది ఇదే!
x
Highlights

అటు చైనా, పాకిస్థాన్ కలయికపై భారత్‌కు పెద్దగా భయం లేదని స్పష్టంగా చెబుతారు విశ్లేషకులు. మోదీ నాయకత్వంలోని భారత్ ప్రపంచ మద్దతుతో తన బలం చాటేందుకు సిద్ధంగా ఉంది.

ఆసియా ఖండంలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ బలహీనతలను కప్పిపుచ్చుకునేందుకు చైనా మద్దతు కోసం వెంపర్లాడుతోంది . మరోవైపు చైనా కూడా పాకిస్థాన్‌కు తన సంపూర్ణ మద్దతును వెల్లడించింది. పాకిస్థాన్ కేవలం చైనాతోనే పరిమితం కాకుండా, రష్యా మద్దతు కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆసక్తికరమైన ప్రశ్నలు ఎగసిపడుతున్నాయ. ఉగ్రవాద శరణార్థ దేశానికి చైనా ఎందుకు వెన్నుదన్నుగా నిలుస్తోంది? రష్యా కూడా పాక్‌కు మద్దతు ఇచ్చేనా?

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ స్పష్టమైన మాటల్లో పాకిస్థాన్‌కు మద్దతు తెలిపారు. భద్రతా పరంగా చైనా పాకిస్థాన్‌కు బలమైన వెన్నుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాకిస్థాన్-ఇండియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, చైనా శాంతి మార్గాల కోసం కోరుతున్నట్లు ప్రకటించింది. అయితే చరిత్రను తిరగెత్తితే, గతంలో కూడా చైనా ఎప్పుడైతే పాకిస్థాన్ కష్టాల్లో పడిందో, వెంటనే అండగా నిలబడి, ఆర్థిక, రక్షణ సహాయం అందించింది. ఇప్పుడు కూడా అదే తీరులో పాకిస్థాన్‌కు బలమిచ్చేందుకు చైనా ముందుకొచ్చింది.

ఇక రష్యా విషయానికి వస్తే, పాకిస్థాన్ స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తును కోరుతోంది. పహల్గాం దాడిలో తమ ప్రమేయం లేదని ధృవీకరించేందుకు చైనా, రష్యా, పశ్చిమ దేశాలతో కలిసి విచారణ జరపాలని కోరుతోంది. ఈ విజ్ఞప్తి స్వయంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నుంచి రావడం గమనార్హం. గతంలో అమెరికా ప్రయోజనాల కోసం ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చిన పాకిస్థాన్ ఇప్పుడు తన పాత్రను మళ్లీ మార్చుకున్నట్లు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది.

చైనా మాటలు కేవలం నైతిక మద్దతుతో ఆగిపోకుండ, భవిష్యత్తులో ఆర్థిక సాయంతో పాటు మిలటరీ రంగంలో రహస్య ఒప్పందాలకు దారితీయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై, ముఖ్యంగా బ్రిక్స్, షాంఘై సహకార సంస్థల వద్ద పాక్‌కు మద్దతుగా నిలబడే అవకాశమూ ఉంది. అదే సమయంలో పాకిస్థాన్ కూడా చైనా మద్దతును తన వ్యూహాత్మక బలంగా చూపిస్తూ రష్యాను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

భారత్ మాత్రం ఈ పరిణామాలన్నింటిని ముందుగానే అంచనా వేసి, గట్టి వ్యూహాలను రూపొందించింది. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేయడం, అటారీ సరిహద్దు మూసివేయడం వంటి దూకుడు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు పాకిస్థాన్ పాత్రను ఎత్తిచూపిస్తూ మద్దతు కూడగట్టుకుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి శక్తివంతమైన దేశాలు ఇప్పటికే భారత్‌కు మద్దతు ప్రకటించాయి. పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోదీ స్వయంగా ప్రపంచ నేతలతో సంప్రదింపులు జరిపారు, విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఆ దిశగా చురుగ్గా పనిచేస్తున్నారు.

అటు చైనా, పాకిస్థాన్ కలయికపై భారత్‌కు పెద్దగా భయం లేదని స్పష్టంగా చెబుతారు విశ్లేషకులు. మోదీ నాయకత్వంలోని భారత్ ప్రపంచ మద్దతుతో తన బలం చాటేందుకు సిద్ధంగా ఉంది. తాత్కాలికంగా పాకిస్థాన్ ధైర్యం సంపాదించినా, భారత్ వ్యూహాత్మకంగా వ్యతిరేక శక్తులను ఒంటరిగా మిగిలిపోయేలా చేసే దిశగా ముందుకు సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories