Oil Prices: పండుగలవేళ కేంద్రం శుభవార్త..
Oil Prices: వంట నూనెల ధరలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
Oil Prices: పండుగలవేళ కేంద్రం శుభవార్త..
Oil Prices: వంట నూనెల ధరలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వంట నూనెలపై ఉన్న బేసిక్ కస్టమ్స్ సుంకం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. వంటనూనెలపై ఉన్న అగ్రిసెస్ ను కూడా తగ్గిస్తున్నట్టు తెలిపింది. కేంద్రం నిర్ణయంతో రిఫైన్డ్ వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకం ఇప్పటివరకు 32.5 శాతం ఉండగా, ఇప్పుడది 17.5 శాతానికి తగ్గింది. పామాయిల్ పై అగ్రిసెస్ 7.5 శాతానికి తగ్గగా, ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు నూనెపై అగ్రిసెస్ 5.5 శాతానికి తగ్గింది. ఈ తగ్గింపులు అక్టోబరు 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్నాయి.