కరోనా నివారణకు దేశమంతటా టీకా కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు చేపట్టిన డ్రైరన్ సూపర్ సక్సెస్ అయింది. నాలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని రెండు రోజులపాటు చేపట్టారు. వచ్చే నెలలో వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టేందుకు... ముందుగా పంజాబ్, గుజరాత్, ఏపీ, అసోం రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించినట్లు ఆరోగ్య శాఖతెలిపింది. ఏపీలోని కృష్ణా జిల్లా, గుజరాత్‌లోని రాజ్‌కోట్, గాంధీనగర్, లుథియానా... పంజాబ్‌లోని షాహీద్ భగత్ సింగ్ నగర్,స అస్సోంలోని సోనిత్ పూర్, నల్పరి జిల్లాల్లోరెండు రోజుల పాటు డ్రైరన్ నిర్వహించారు.
నిన్న పూర్తిగా వాలంటీర్ల మాక్ రిజిస్ట్రేషన్లపై దృష్టిసారించిన అధికారులు... ఇవాళ డమ్మీ టీకా ఏర్పాట్లు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 125మంది ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు. అంతకుముంద వీరంతా కోవిన్ యాప్‌లో వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత వారి మొబైల్ ఫోన్లకు వచ్చిన ఎస్ఎంఎస్ మేరరకు వారికికేటాయించిన ప్రాంతాల్లోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో రిపోర్ట్ చేసి డమ్మీ టీకాకు సహకరించారు.
నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్ టీకా కోసం ఉంచిన ఏర్పాట్లను తనిఖీ చేయడానికి డ్రైరన్ కార్యక్రమం చేపట్టారు. వాస్తవ టీకా డ్రైవ్ ప్రారంభానికి ముందే ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి సాయం కేటాయించడం ఈ కార్యక్రమం లక్ష్యం. డ్రైరన్ సమనయంలో కోవిన్ కార్యచరణను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులడ్రైరన్‌లో పరిశీలించిన విషయాలను నివేదిక రూపంలో తయారుచేసి అధికారులు కేంద్రానికి సమర్పించనున్నారు.