TOP 6 News @ 6PM: సెంచరీతో ఇరగదీసిన శుభ్‌మన్ గిల్... ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ అనే మరో రికార్డ్

Update: 2025-02-12 12:34 GMT

India vs England 3rd ODI :సెంచరీతో ఇరగదీసిన శుభ్‌మన్ గిల్... ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ అనే మరో రికార్డ్

1) శుభ్‌మన్ గిల్ సెంచరీ... ఇంగ్లండ్‌కు భారీ విజయ లక్ష్యం

IND vs ENG 3rd ODI, Shubman Gill hits 7th ODI century: శుభ్‌మన్ గిల్ సెంచరీతో ఇరగదీశాడు. 102 బంతుల్లో 112 పరుగులు చేసి మరో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్ కెరీర్లో ఇది 7వ వన్డే సెంచరీ. తన 50వ వన్డే మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్ అనే రికార్డ్ కూడా గిల్‌కే దక్కింది. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52), కేఎల్ రాహుల్ (40) లాంటి ఆటగాళ్లు కూడా రెచ్చిపోయారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లు, మార్క్ ఉడ్ 2 వికెట్స్‌తో రాణించారు. మిగతా బౌలర్లు ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. 

2) చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి వెనుక కొవ్వూరి వీర రాఘవ రెడ్డి... ఎవరీ వీర రాఘవ?

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామరాజ్యం స్థాపన పేరుతో పూజారిపై దాడి చేసింది ఎవరు? ఆ ముఠా నాయకుడు ఎవరు? ఎందుకు ఈ దాడి చేశారు? ఏమని బెదిరించారు? ఆయన నుండి వారు ఏం డిమాండ్ చేశారు? ఎప్పటివరకు డెడ్ లైన్ పెట్టారు? ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు కొవ్వూరి వీర రాఘవ రెడ్డి సహా మొత్తం ఐదుగురుని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) Free Bus Scheme: ఉచితమే కానీ జిల్లాల వరకే.. ఫ్రీ బస్సు పథకంలో ఏపీ సర్కార్ ట్విస్ట్

Free Bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంతగానో ఎదురుచూస్తున్న మహిళలకు.. ఫ్రీ బస్సు పథకంలో సర్కార్ ఓ ట్విస్ట్ ఇవ్వబోతోంది. రాష్ట్రం మొత్తం కాకుండా కేవలం జిల్లాలకే పరిమితం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే మంత్రి వర్గ ఉప సంఘం ఈ పథకం అమలవుతున్న పలు రాష్ట్రాల్లో పర్యటించి నివేదికను కూడా సమర్పించింది. మరోవైపు రవాణా శాఖ అధికారులు సైతం ఈ పథకం వల్ల ఎంత భారం పడుతుందన్నది ఇప్పటికే స్పష్టం చేశాయి. కర్ణాటక, తమిళనాడులో ఉచిత బస్సు పథకం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ నస్టాల బారిన పడటమే కాకుండా ప్రభుత్వానికి భారంగా మారిందన్న విషయాలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల్లో ఫ్రీ బస్సు పథకంలో లోటుపాట్లను గుర్తించిన ప్రభుత్వం.. ఈ పథకంలో మార్పులు చేయాలని నిర్ణయించింది.

4) Supreme Court: ఉచిత పథకాలు మంచివి కావు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయా పార్టీలు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. అయితే ఇది మంచి పద్ధతి కాదని చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఉచితాలపై ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదని తెలిపింది. దురదృష్టవత్తు వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఆసక్తి చూపడంలేదని అభిప్రాయపడింది. ఉచిత రేషన్, డబ్బులు అందుతున్నాయని.. ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండడం వల్లే ఇలా జరుగుతోందని తెలిపింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వాల ఉధ్దేశాలు మంచివేనని.. కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని సూచించింది.

5) సర్పంచ్ హక్కులను అమ్ముకున్న మహిళను పదవిలోంచి తొలగించిన సర్కార్

గ్రామ సర్పంచ్‌గా గెలిచిన ఒక మహిళ సర్పంచ్‌కు ఉండే హక్కులు, అధికారాలను మరొకరిని అమ్ముకున్నారు. ఈ వార్త జిల్లా, రాష్ట్రస్థాయిలోనేకాకుండా జాతీయ స్థాయిలోనూ వైరల్ అయింది. దీంతో స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం ఆమెను సర్పంచ్ పదవిలోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా మానస జనపద్ సమీపంలోని దాత గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. దాత గ్రామ సర్పంచ్ కైలాష్ బాయి కచ్వ గ్రామ సర్పంచ్‌గా తనకు ప్రభుత్వం కల్పించిన హక్కులు, విధులు, అధికారాలను అదే గ్రామానికి చెందిన సురేశ్ గరసియా అనే యువకుడికి అమ్ముకున్నారు. ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఇళ్లు ఇచ్చే పథకం, మంచి నీటి పథకం... ఇలా ఒకటేమిటి.. గ్రామస్తులకు ప్రభుత్వం అందించే అన్ని పథకాలపై సర్పంచ్‌కు ఉండే పవర్స్ అన్నీ సురేశ్ పేరిట బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకోసం రూ. 500 స్టాంప్ పేపర్‌పై ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Chiranjeevi: ఇంట్లో నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది.. చర్చకు దారి తీస్తున్న చిరంజీవి వ్యాఖ్యలు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఆయన అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన చిరంజీవిని ఎంతో మంది గౌరవిస్తారు. ఆదర్శంగా తీసుకుంటారు. అయితే ఎంతటి వారైన సరే ఒక్కోసారి వారు మాట్లాడిన తీరు విమర్శలకు దారి తీస్తుంది. తాజాగా చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బ్రహ్మ ఆనందం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు చిరంజీవి హాజరయ్యారు. అయితే యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు చిరంజీవి మాట్లాడుతూ.. ఇంట్లో తన పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది. నా చుట్టూ మొత్తం ఆడపిల్లలే.. చరణ్ ని ఒక్కోసారి అడుగుతుంటాను.. దయచేసి ఈ సారి ఒక అబ్బాయిని కనురా.. మన లేగసీని ముందుకు కొనసాగించాలి. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది అని నవ్వుతూ అన్నారు. అయితే చిరంజీవి మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News