Spider Smuggling: విమానాల్లో 107 సాలీళ్ల స్మగ్లింగ్

Spider Smuggling: చెన్నై ఎయిర్ పోర్టు వచ్చిన ఓ పార్శిల్ లో ఇంజెక్షన్ ఇచ్చేందుకు వాడే ప్లాస్టిక్ వయల్స్ 107 నల్ల సాలీళ్లు వున్నాయి.

Update: 2021-07-03 09:36 GMT

Illegal Smuggling of Spiders

Spider Smuggling: స్మగ్లింగ్ స్మగ్లింగ్ ఈ పదం ఈ మధ్య కాలంలో తరుచుగానే వింటూ వున్నాము. సాధారణంగా స్మగ్లింగ్ అంటే బంగారం అనుకుంటాం లేదా ఎలక్ట్రానిక్ గూడ్సో, మద్యం బాటిల్సో అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ స్మగ్లింగ్ చేసింది సాలీళ్లను. ఆశ్చర్యంగా వుంది కదా నిజంగానే చెన్నై ఎయిర్ పోర్టులో యూరప్ దేశం పోలాండ్ నుంచి ఓ పార్శిల్ వచ్చింది. దానికి సంబంధించి... విదేశాల్లో పోస్టాఫీసు నుంచి ఇండియాకి ముందే ఓ సమాచారం వచ్చింది. కస్టమ్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. పోలాండ్ నుంచి ఏ పార్శిల్ వచ్చినా... ఆపి లోతుగా చెక్ చెయ్యాలి అనుకున్నారు.

అదే విధంగా పార్శిల్ వచ్చింది. దానిపై టీచింగ్ మెటీరియల్ అని రాసి ఉంది. దాన్ని ఓపెన్ చేశారు. లోపల థర్మాకోల్‌ తో ఓ బాక్స్ ఉంది. దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చెయ్యగా... ఇంజెక్షన్ ఇచ్చేందుకు వాడే ప్లాస్టిక్ వయల్స్ 107 ఉన్నాయి.ఈ వయల్సేంటి... అనుకొంటూ అధికారులు వాటిని జాగ్రత్తగా చూస్తే... వాటిలో ఒక్కో దాంట్లో ఒక్కో నల్ల సాలీడు ఉంది. అలా మొత్తం 107 సాలీళ్లు ఉన్నాయి. అవన్నీ బతికే ఉన్నాయి. ఈ వయల్సేంటి... అనుకొంటూ అధికారులు వాటిని జాగ్రత్తగా చూస్తే... వాటిలో ఒక్కో దాంట్లో ఒక్కో నల్ల సాలీడు ఉంది. అలా మొత్తం 107 సాలీళ్లు ఉన్నాయి. అవన్నీ బతికే ఉన్నాయి.

WCCB అధికారులు వచ్చి... ఈ అరుదైన నల్ల సాలీళ్ల పార్శిల్‌ను తిరిగి వెనక్కి పంపేయాలని చెప్పారు. వాటి విలువ రూ.7.6 లక్షల దాకా ఉంటుందని తెలిపారు. ఆ సాలీళ్ల దిగుమతికి సంబంధించి ఎలాంటి అనుమతులూ, లైసెన్సులు, డాక్యుమెంట్లూ లేవు. ఇదో ఇల్లీగల్ పార్శిల్ అన్నమాట. వెనక్కి పంపడం ఓకేగానీ... అసలు దీన్ని తమిళనాడుకు ఎందుకు పంపారు, ఎవరు పంపారు... ఈ వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు. సమాచారం వుంది కాబట్టి వాటిని పసిగట్టి చెక్ చేశారు మన అధికారులు. అదే ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి వస్తే ఎరకం వైరస్ ను మన దేశానికి పంపారో ఎవరు చెబుతారు... దానికి బాధ్యత ఎవరి అనే ప్రశ్నలు సాటి నెటిజన్లు వేసుకుంటున్నారు.

Tags:    

Similar News