రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? టికెట్ బుక్ చేసుకునే ముందు ఈ నిబంధనలు తెలుసుకోండి!

లాక్ డౌన్ లో వివిధ ప్రాంతాల్లో చిక్కుపడి స్వంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు.. ఇతర అవసరాల కోసం ప్రయాణాలు చేయాలనుకునే వారు ఇక రైలు ఎక్కడానికి సిద్ధం అయిపోవచ్చు.

Update: 2020-05-11 13:21 GMT

లాక్ డౌన్ లో వివిధ ప్రాంతాల్లో చిక్కుపడి స్వంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు.. ఇతర అవసరాల కోసం ప్రయాణాలు చేయాలనుకునే వారు ఇక రైలు ఎక్కడానికి సిద్ధం అయిపోవచ్చు.రైలు బండి కూతకు రెడీ అయిపోతోంది. ఇప్పటికే రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇక మీరే కారణం చేత రైలు ప్రయాణం చేయాలనుకున్నా సరే.. కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. రైలు ఎక్కాలంటే ఎం చేయాలి? జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి ఒకసారి మీకోసం..

బుధ‌వారం నుంచి 15 జతల రైళ్లను ప్రారంభిస్తున్న‌ట్ల రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌క‌టించిన మార్గ‌ద‌ర్శ‌కాలు చూస్తే..

* ఐఆర్‌సీటీసీలో టిక్కెట్ల బుకింగ్‌కు

* ఈ-టిక్కెట్లు కన్‌ఫర్మ్‌ అయిన వారిని మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతి

* ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా స్క్రీనింగ్‌ చేయించుకోవాలి

* రైలు షెడ్యూల్, ప్రయాణికుల బుకింగ్, ఎంట్రీ, కదలికలు, కోచ్ సేవల వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖే విస్తృతంగా ప్రచారం

* ఈ-టికెట్ ఆధారంగా ప్రయాణీకుల కదలికలు

* రైల్వే స్టేషన్‌కు ప్ర‌యాణికుల‌తో వ‌చ్చే వాహనం డ్రైవర్‌కు అనుమతి

* కోవిడ్19 లక్షణాలు లేని వారికి రైళ్లలో ప్రయాణానికి అనుమతి

*ప్రయాణికుల కోసం స్టేషన్‌, కోచ్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద హ్యాండ్‌ శానిటైజర్లు ఏర్పాటు

*ప్రయాణం సమయంలో మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా‌ ధరించాలి

* బోర్డింగ్‌, కోచ్‌లలో ప్రయాణిస్తున్న సమయంలో సోష‌ల్ డిస్టెన్స్ త‌ప్ప‌నిస‌రి

* ప్రయాణికుల కోసం ఆరోగ్య సలహాలు

ఇక చివ‌రిగా ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకున్న త‌ర్వాత ఆ రాష్ట్రం సూచించిన ఆరోగ్య నియమాలకు క‌ట్టుబ‌డి ఉండాల‌ని కేంద్ర హోం శాఖ స్ప‌ష్టం చేసింది. 

Tags:    

Similar News