హోలీ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది... కానీ శుక్రవారం నమాజ్... పోలీస్ ఆఫీసర్ కామెంట్స్ వైరల్
Holi 2025: ఈ ఏడాది హోలీ పండగ మార్చి 14న వస్తోంది. ఆ రోజు శుక్రవారం అవుతోంది. ప్రస్తుతం ముస్లింలకు రంజాన్ మాసం నడుస్తోంది.
హోలీ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది... కానీ శుక్రవారం నమాజ్... పోలీస్ ఆఫీసర్ కామెంట్స్ వైరల్
"శుక్రవారం నమాజ్ ఏడాదికి 52 సార్లు వస్తుంది.. కానీ హోలీ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. హోలీ రంగులతో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రోజు ఇంట్లోంచి బయటికి రాకండి" అంటూ ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్ కొత్వాలి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ అనుజ్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
అసలేం జరిగిందంటే...
ఈ ఏడాది హోలీ పండగ మార్చి 14న వస్తోంది. ఆ రోజు శుక్రవారం అవుతోంది. ప్రస్తుతం ముస్లింలకు రంజాన్ మాసం నడుస్తోంది. రంజాన్ మాసంలో శుక్రవారం నాడు హోలీ పండగ వస్తుండటంతో ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటం కోసం గురువారం నాడు కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశం అనంతరం సంభల్ కొత్వాలి సర్కిల్ ఆఫీసర్ అనుజ్ చౌదరి మాట్లాడుతూ... "శుక్రవారం నమాజ్ సంవత్సరంలో 52 సార్లు వస్తుంది. కానీ హోలీ పండగ మాత్రం ఏడాదికి ఒక్కసారే వస్తుంది. ఆ రోజు హోలీ రంగులతో సమస్య ఉన్న వారు ఇంట్లోంచి బయటకు రాకండి. లేదంటే హోలీ పండగ రోజు బయటికొచ్చే వారికి ఈ విషయాన్ని అర్థం చేసుకునే బ్రాడ్ మైండ్‌సెట్ ఉండాలన్నారు. పండగలు అంటేనే కలిసి చేసుకునే ఉత్సవాలు. అవి మత సామరస్యాన్ని చాటిచెప్పేవిగా ఉండాలి" అని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
#Sambhal- हमारे मुजफ्फरनगर के वासी संभल के दबंग CO अनुज चौधरी की दो टूक
— विभोर अग्रवाल🇮🇳 (@IVibhorAggarwal) March 6, 2025
जिन्हें रंग से ऐतराज, होली के दिन घर से न निकलें,
साल में 52 जुमे होते हैं और होली सिर्फ एक बार आती है।
होली को लेकर पीस कमेटी की मीटिंग में CO की सख्त चेतावनी…!@wrestleranuj @myogiadityanath #holi pic.twitter.com/BlNUl1RLgU
రెండు మతాల వారిని ఉద్దేశించి మాట్లాడుతూ... ఎదుటి వారి సెంటిమెంట్స్ ను కూడా గౌరవిస్తూ పండగలు సెలబ్రేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవతలి వారికి ఇష్టం లేకుండా బలవంతంగా రంగులు రుద్దకూడదన్నారు.
ముస్లింలు ఎలాగైతే రంజాన్ పండగ కోసం వేచిచూస్తారో... అలాగే హిందువులు కూడా హోలీ పండగ కోసం ఎదురుచూస్తారు. రెండు మతాల పండగల సారాంశం కూడా ఐక్యమత్యాన్ని, పరస్పర గౌరవాన్ని చాటిచెప్పేవిగానే ఉంటాయని అనుజ్ చౌదరి అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూడటమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం. ఎవరైనా పరిస్థితులను చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.
అయితే, అనుజ్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలను సమాజ్ వాదీ పార్టీ అధికార ప్రతినిధి శర్వేంద్ర బిక్రమ్ సింగ్ అభ్యంతరం చెప్పారు. అనుజ్ చౌదరి ఒక పోలీసు ఆఫీసర్ తరహాలో మాట్లాడటం లేదని, ఆయన బీజేపి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని అన్నారు.
యూపీ కాంగ్రెస్ మీడియా కమిటి వైస్ చైర్మన్ మనీష్ హిందీ మాట్లాడుతూ అధికారులు ఎప్పుడు లౌకికంగా ఉండాలి అని సూచించారు. "హోలీ రంగులతో ఒక మతం వారికి ఏదైనా ఇబ్బంది ఉందని భావిస్తే... వారికి ఏ సమస్య రాకుండా చూడటమే పోలీసు అధికారుల బాధ్యత. కానీ ఇలా ఒక వర్గం కోసం మాట్లాడినట్లుగా ఉండకూడదు" అని మనీష్ వ్యాఖ్యానించారు.
Also watch this video: Actress Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఏంటి ఈ హీరోయిన్ వెనకున్న పొలిటీషియన్ ఎవరు?
Also watch this video: Trump tariffs Impacts on India: ట్రంప్ టారిఫ్‌లతో ఇండియా బేజారు
Also watch this video: Tax Free Countries: ఇన్‌కమ్ టాక్స్ లేని దేశాలు | No Income Tax