Toll Gate: నేటి నుంచి అమల్లోకి కొత్త టోల్ ఫీజులు

Toll Gate: జాతీయ రహదారులపై టోల్‌ రుసుములు పెరిగాయి.

Update: 2021-04-01 03:09 GMT

Toll Gate:(ఫోటో ది హన్స్ ఇండియా)

Toll Gate: మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టు అసలే కరోనా తో ఆర్థిక వ్యవస్థ అస్థవ్యవస్థం అయి, ఉద్యోగాలు పోయి, చేతినిండా పనిలేక అల్లాడుతున్నజనాల పై అన్నిటి పై ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నాయి ప్రభుత్వాలు. తాజా గా జాతీయ రహదారులపై టోల్‌ రుసుములు పెరిగాయి. ఒక్కో వాహనానికి ఇరువైపులా కలిపి కనిష్ఠంగా రూ. 5 నుంచి గరిష్ఠంగా రూ. 25 వరకు, నెలవారి పాస్‌కు కనిష్ఠంగా రూ. 90 నుంచి గరిష్ఠంగా రూ.590 వరకు, లోకల్‌ పాస్‌కు రూ. 10 వరకు పెంచారు. హైదరాబాద్‌-విజయవాడ (65), హైదరాబాద్‌-భూపాలపట్నం (163) జాతీయ రహదారులను బీవోటీ పద్ధతిలో నిర్మించారు. గుత్తేదారు సంస్థలు ఏడాదికోసారి టోల్‌ రుసుములను పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదించడంతో యాదాద్రి జిల్లాలోని పంతంగి, గూడురు, నల్గొండ జిల్లాలోని కొర్లపహాడ్‌, ఏపీలోని జగ్గయ్యపేట చిల్లకల్లు వద్ద జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచే కొత్త రుసుములు అమలులోకి వచ్చాయి. ఏడాది కాలం పాటు ఇవే అమల్లో ఉంటాయి.

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌కు ఒకవైపు రూ. 80, ఇరువైపులా కలిపి రూ. 120, లైట్‌ కమర్షియల్‌, గూడ్స్‌ వెహికల్‌, మినీ బస్సుకు ఒకవైపు రూ. 130, ఇరువైపులా కలిపి రూ. 190, బస్సు, ట్రక్కు (2 యాక్సిల్‌)కు ఒకవైపు రూ. 265, ఇరువైపులా కలిపి రూ. 395గా నిర్ణయించారు.

కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌కు ఒకవైపు రూ. 110, ఇరువైపులా కలిపి రూ. 165, లైట్‌ కమర్షియల్‌, గూడ్స్‌ వెహికల్‌, మిని బస్సుకు ఒక వైపు రూ. 175, ఇరువైపులా కలిపి రూ. 260, బస్సు, ట్రక్కు (2 యాక్సిల్‌)కు ఒక వైపు రూ. 360, ఇరువైపులా కలిపి రూ. 540గా నిర్ణయించారు.

హైదరాబాద్‌-భూపాలపట్నం జాతీయ రహదారిపై గూడురు టోల్‌ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌కు ఒకవైపు రూ. 100, ఇరువైపులా కలిపి రూ. 150, లైట్‌ కమర్షియల్‌, గూడ్స్‌ వెహికల్‌, మినీ బస్సుకు ఒకవైపు రూ. 150, ఇరువైపులా కలిపి రూ. 225, బస్సు, ట్రక్కు (2 యాక్సిల్‌)కు ఒకవైపు రూ. 305, ఇరువైపులా కలిపి రూ. 460గా నిర్ణయించారు. భారీ, అతి భారీ వాహనాల రుసుములు కూడా రూ. 20 నుంచి రూ. 35 వరకు పెరిగాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. ఏడాది కాలం పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయి.

Tags:    

Similar News