Tamil Nadu: త్వరగా పిల్లలను కనండి..నూతన దంపతులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచన
Tamil Nadu: త్వరగా పిల్లలను కనండి..నూతన దంపతులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచన
Tamil Nadu: కొత్త దంపతులు పిల్లలను కనడం వాయిదా వేసుకోకూడదని తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు. త్వరగా పిల్లలను కనాలంటూ సూచించారు. జనాభా సంఖ్య పెరిగితేనే ఎంపీల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. నాగపట్టిణం జిల్లాలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో స్టాలిన్ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో తమిళనాడు హక్కులను బీజేపీ లాక్కొవాలని చూస్తోందంటూ ఆరోపించారు. నియోజకవర్గాల సంఖ్య తగ్గించాలని త్రిభాషా విధానం తీసుకురావాలని కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు.