Gujarat: హైదరాబాద్‌లో గుజరాత్‌ పరీక్ష పేపర్ లీక్.. పరీక్ష వాయిదా

Gujarat: లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసిన గుజరాత్ ప్రభుత్వం

Update: 2023-01-29 10:01 GMT

Gujarat: హైదరాబాద్‌లో గుజరాత్‌ పరీక్ష పేపర్ లీక్.. పరీక్ష వాయిదా 

Gujarat: గుజరాత్ పరీక్ష పేపర్ హైదరాబాద్‌లో లీక్ అయింది. పరీక్షకు సరిగ్గా రెండు గంటల ముందు పంచాయతీ రాజ్‌శాఖకు సంబంధించిన పరీక్ష పేపర్ లీక్ అయింది. ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసింది గుజరాత్ ప్రభుత్వం. గుజరాత్ పరీక్షకు హైదరాబాద్‌తో పాటు ఆంధ్రాలోనూ పరీక్ష పేపర్లు ప్రింట్ అయ్యాయి. ఒడిశాకు చెందిన ప్రదీప్ నాయక్‌ పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన జీత్‌ నాయక్‌కు పరీక్ష పేపర్‌ను ప్రదీప్‌ నాయక్‌ అందించినట్లు తెలిసింది. దీంతో జీత్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ ఘటనలో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రాలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News