Special Marriage: పెళ్లి కూతురుకు సర్‌ప్రైజ్ ఇచ్చిన భర్త..!

Special Marriage: పెళ్లి అనగానే భూదేవి అంత పెళ్లి పందిరి వేసి ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలని కొందరు భావిస్తుంటారు.

Update: 2023-02-10 04:49 GMT

Special Marriage: పెళ్లి కూతురుకు సర్‌ప్రైజ్ ఇచ్చిన భర్త..!

Special Marriage: పెళ్లి అనగానే భూదేవి అంత పెళ్లి పందిరి వేసి ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలని కొందరు భావిస్తుంటారు. పెళ్లిని సాధాసీదాగా కాకుండా ఏదో ఒక స్పెషల్‌గా ఉండాలని ఆరాటపడుతుంటారు. పెళ్లి కూతురిని సర్‌ప్రైజ్ చేయడానికి కొందరు పెళ్లికొడుకులు వెరైటీ వెరైటీ ప్లాన్లు చేస్తుంటారు. అందులో భాగంగానే పెళ్లి తర్వాత నేరుగా భార్యను హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకెళ్లి సరప్రైజ్ చేశాడు వరుడు. దీంతో వరుడి కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యానికి గురై ఆనందం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌ బులెంద్‌షెహర్‌ జిల్లాకు చెందిన ప్రతాప్‌సింగ్ సోలంకి..మేరఠ్ జిల్లాకు చెందిన యాషాంసీ రాణాని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం రాత్రి వీరి వివాహం ఘనంగా జరిగింది. లోకేంద్ర ప్రతాప్ ఆస్ట్రేలియాలో పైలెట్‌కాగా..యాషాంసీ రాణా కమర్షియల్ పైలెట్‌గా పనిచేస్తోంది. ఇద్దరూ పైలెట్లే కావడంతో..పెళ్లి తర్వాత తన భార్యను హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు వరుడు. దీంతో పెళ్లికూతురు కూడా సంతోషం వ్యక్తం చేసింది. 

Tags:    

Similar News