Gold Rates: భారీగా పెరగనున్న బంగారం ధరలు? గోల్డ్ కొనాలకుంటే ఇదే సరైన సమయం

Gold Rates: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గత వారం రోజుల్లో భారీగా పెరిగాయి.

Update: 2021-04-11 16:15 GMT

బంగారం (ఫైట్ ఫొటో)

Gold Rates: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గత వారం రోజుల్లో భారీగా పెరిగాయి. గత నెల మార్చి 31న 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,228లుగా ఉంది. కాగా, నిన్న(10 ఏప్రిల్) రూ. 46,554కు చేరింది. ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

బంగారం ధరలు పెరుగుతున్న కారణంగా రాబోయే రోజుల్లో రేట్లు ఎలా ఉంటాయోనని ఆసక్తి నెలకొంది. ద్రవ్యోల్భణం పెరగడం, కరోనా కేసులు మరలా పెరుగుతుండడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే, బంగారం ధర మరలా రూ.49,000ను చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలని భావించేవారు ఇప్పుడే తీసుకోవడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. మరలా లాక్ డౌన్ విధిస్తారనే ఊహాగానాలతో చాలా మంది స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకొని బంగారం మీద తక్కువ కాలానికి పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బంగారం ధరలు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News