E-Epic Card: క్షణాల్లో మీ ఓటరు గుర్తింపు కార్డు పొందండిలా.. మొబైల్ ఉంటే చాలు..!
E-Epic Card Download: అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమైంది. ఇటీవలే ఎలక్షన్ నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
E-Epic Card: క్షణాల్లో మీ ఓటరు గుర్తింపు కార్డు పొందండిలా.. మొబైల్ ఉంటే చాలు..!
E-Epic Card Download: అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమైంది. ఇటీవలే ఎలక్షన్ నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు ఓ గుడ్‌న్యూస్ అందించింది. ఈ-ఓటరు గుర్తింపు కార్డు(E-Epic)ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఛాన్సిచ్చింది.
ఈ మేరకు వెబ్‌సైట్‌లో కీలక మార్పులు చేసినట్లు పేర్కొంది. కేవలం మొబైల్ నంబరు నమోదు చేస్తే చాలు.. క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును సులుభంగా పొందవచ్చు. రానున్న ఎలక్షన్‌లో జనాలు ఓటుహక్కును ఉపయోగించుకునేందుకు ఇది చెల్లుబాటు అవుతుందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
ఈ అవకాశం పొందాలంటే మాత్రం.. ఫాం-8ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందులో ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఇదే ఫాంతో మొబైల్ నంబరును చేర్చేందుకు, మార్చేందుకు ప్రత్యేక కాలమ్ అందించారు.
https://voters.eci.gov.in లో e-epic సెక్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను ఎంటర్ చేయాలి.
ఆ వెంటనే నమోదు చేసిన ఫొన్ నంబరుకు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేయగానే ఈ-ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఓటర్ కార్డ్ అన్ని ధ్రువపత్రాల మాదిరిగా ఉపయోగించుకోవచ్చు.
ఈ కార్డ్ ఉంటే ఎన్నికల సంఘం నుంచి వచ్చే కార్డ్ కోసం చూడాల్సిన అవసరం ఉండదు.
కాగా, ఈ ఆఫ్షన్ ఇది వరకు కూడా ఉంది. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందేందుకు చాలా సమయం పట్టేది.
మార్పులు, చేర్పులు చేసిన తర్వాత ఆయా సంబంధిత అసెంబ్లీ ఎలక్షన్ ఆఫీసర్ ఆమోదించాల్సి వచ్చేది. ఆ తర్వాతే మార్పులు, చేర్పులు జరిగేవి. తాజా ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విధానాన్ని చాలా సులభం చేసింది.