సామాన్యుడికి షాక్ ఇచ్చిన చమురు సంస్థలు.. గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెంపు...
Fuel Price Hike: *రూ. 1,052కి చేరిన గ్యాస్ సిలిండర్ ధర *అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన కొత్త రేట్లు
సామాన్యుడికి షాక్ ఇచ్చిన చమురు సంస్థలు.. గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెంపు...
Fuel Price Hike: వినియోగదారులకు చమురు కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 50 రూపాయలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరతో గ్యాస్ సిలిండర్ 1052 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇటీవల 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర కూడా 102 రూపాయల 50 పైసలు పెంచాయి. వారం రోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో సామన్యులు ఇబ్బంది పడుతున్నారు.