Viral News: మీదికి మొక్కజొన్న.. లోపలేమో పాడు పని..

* కేటుగాళ్లు కథలుపడుతున్నారు. పుష్ప సినిమా నుంచి స్ఫూర్తి పొందారో లేక ఎవరూ కనిపెట్టాలేరనే ధీమానో ఏమో..పచ్చని పొలాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా గంజాయి పంట పడించేస్తున్నారు.

Update: 2023-05-18 16:00 GMT

Viral News: మీదికి మొక్కజొన్న.. లోపలేమో పాడు పని..

Drugs: దేశంలో గంజాయి గుప్పుమంటోంది. ఒకప్పుడు మారుమూల పల్లెలు, కొండలు, గుట్టల మధ్య గుట్టుగా గంజాయి సాగు జరిగేది. కానీ ఇప్పుడు దీన్ని అంతర్ పంటగా పండించేస్తున్నారు. మిర్చి, వరి, పత్తి... ఇలా పంట ఏదైనా.. గంజాయిని అంతర్ పంటగా సాగు చేస్తున్నారు. తాజాగా గుజరాత్ లోని పంచమహల్ జిల్లా బోరియా గ్రామంలో ఒక వ్యక్తి మొక్కజొన్న తోట మధ్యలో గంజాయి సాగు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బొరియా గ్రామానికి చెందిన శంకర్.. బస్ కండక్టర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. పదవీ విరమణ తర్వాత ఎంచక్కా ఇంటి వద్ద కూర్చొని కృష్ణా, రామా అంటూ కాలం గడపాల్సిన శంకర్ కు ఈజీగా డబ్బు సంపాదించాలనే యావ పుటింది. ఇంకేముంది తన ఇంటి సమీపంలోని ఉన్న మొక్క జొన్న పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు... ఆ పొలంలోనే గంజాయి సాగు ప్రారంభించాడు. బయట నుంచి చూస్తే ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పొలం మధ్యలో 33 గంజాయి మొక్కలను పెంచుతున్నాడు.

పొలాన్ని బయట నుంచి చూస్తే చక్కగా మొక్కజొన్న పొత్తులతో కళకళలాడుతూ ఉంది. అయితే ఎవరైనా చేలోకి వెళ్లి చూశారో లేక.. పొలం నుంచి వాసన తేడాగా వస్తుందని సమాచారం ఇచ్చారో తెలియదు కానీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అధికారులు పొలం పై మెరుపు దాడి చేశారు. ఈ సోదాల్లో మొక్కజొన్నల మధ్య ఉన్న 33 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్నారు. మొక్కల ద్వారా 54.72 కేజీల బరువు గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. దీని విలువ రూ.5.47 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిటైర్డ్ బస్ కండక్టర్ శంకర్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Tags:    

Similar News