Central Cabinet Expansion: నలుగురు మంత్రులు ఔట్‌

Central Cabinet Expansion 2021: నలుగురు మంత్రులు ఔట్‌

Update: 2021-07-07 08:50 GMT

కేంద్ర మంత్రి సంతోష్ & రమేష్ పొక్రియాల్ (ఫైల్ ఇమేజ్)

Central Cabinet Expansion 2021 - BJP: కేంద్ర కేబినెట్ విస్తరణ ఉత్కంఠ రేపుతోంది. సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోడీ టీమ్‌లోకి కొత్తగా రానున్న మంత్రులు ప్రమాణం చేయనుండగా.. కొద్ది గంటల ముందే పలువురు మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే మానవవనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌, స్మృతి ఇరానీ, సదానందగౌడలు మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో ఆ స్థానాలను ఎవరికి కేటాయిస్తారు..? కొత్తగా చోటు దక్కేదెవరికి అనే ఉత్కంఠ నెలకొంది. కొత్తగా మంత్రివర్గంలోకి రానున్న 43 మంది రాష్ట్రపతి భవన్‌ వేదికగా ప్రమాణం చేయనుండగా.. అందులో 23 మంది అనుభవం కలిగిన ఎంపీలకు పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News