ప్రముఖ పర్యావరణ‌వేత్త పచౌరీ కన్నుమూత

Update: 2020-02-14 01:54 GMT

ప్రముఖ పర్యావరణవేత్త, తేరీ( ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్) మాజీ చీఫ్ ఆర్‌కే పచౌరీ(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన న్యూఢిల్లీలోని ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తేరి మాజీ చీఫ్ ఆర్కె పచౌరి కన్నుమూసినట్లు తేరి డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ శుక్రవారం తెలిపారు.

"టెరి వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఆర్.కె.పచౌరి కన్నుమూసినట్లు మేము ప్రకటించడం చాలా బాధతో ఉంది. ఈ దుఃఖంలో తేరీ కుటుంబం మొత్తం డాక్టర్ పచౌరి కుటుంబంతో ఉంది. డాక్టర్ పచౌరి యొక్క నిరంతర పట్టుదల కారణంగా ఈ రోజు తేరి ఈ స్థితిలో ఉంది. సుస్థిరత ప్రదేశంలో మమ్మల్ని తేరీని ప్రముఖ సంస్థగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు" అని 2015 లో పచౌరి తరువాత వచ్చిన తేరి డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ అన్నారు.

ప్రపంచ సుస్థిర అభివృద్ధికి డాక్టర్ పచౌరి అందించిన సహకారం అసమానమైనది. వాతావరణ మార్పులపై ఇంటర్‌ గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపిసిసి) కు ఆయన నాయకత్వం వహించారు. అని తేరి చైర్మన్ నితిన్ దేశాయ్ అన్నారు. ఇటువంటి క్షణాల్లో ఆయన గురించి.. ఆయన చేసిన సేవలను గురించి చర్చించుకోవలసి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. పచౌరి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

ఇదిలావుంటే గత ఏడాది జులైలో మెక్సికోలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయనకు ఓపెర్ట్ హార్ట్ సర్జరీ కూడా చేశారు. ఈ క్రమంలో గుండె జబ్బు మరింత తీవ్రతరం అయింది. దాంతో ఇటీవల న్యూఢిల్లీలోని ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే మంగరళవారం నుంచి ఆయన ఆరోగ్యం మరింత విషమించింది.

దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ నిన్న మరణించారని వైద్యులు స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన గతంలో తేరీ డైరక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం తరువాతే ఆయన తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. ఆయన మృతితో పర్యావరణ వేత్తలు షాక్ లో మునిగిపోయారు.

Tags:    

Similar News