Ayodhya Temple: అయోధ్య రామాలయం పునాది పనుల్లో తొలిదశ పూర్తి

Ayodhya Temple: కనీసం వెయ్యేళ్లు నిలిచేలా ఆలయాన్ని నిర్మిస్తున్నామన్న ట్రస్ట్

Update: 2021-09-16 13:50 GMT

అయోధ్య రామాలయం నిర్మాణం తాజాలో దశ పనులు పూర్తి 

Ayodhya Temple: అయోధ్యలో రామ మందిర పునాది పనుల్లో తొలి దశ పూర్తయినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు. కనీసం వెయ్యేళ్లు నిలిచేలా రామాలయాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. నిర్మాణ కార్యక్రమంలో అత్యుత్తమ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు పని చేస్తున్నారని తెలిపారు. నిర్మాణం కోసం కేవలం రాళ్లను మాత్రమే వాడుతున్నామని ఉనుము, ఉక్కు వాడటం లేదని ఇదొక ఇంజినీరింగ్ అద్భుతమని చెప్పారు. రామ జన్మభూమి కోసం జరిగిన ఉద్యమం ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందన్నారు.

Tags:    

Similar News