Odisha: ఒడిశా ఆరోగ్య మంత్రిపై కాల్పులు.. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మంత్రి

Odisha: ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఘటన

Update: 2023-01-29 08:11 GMT

Odisha: ఒడిశా ఆరోగ్య మంత్రిపై కాల్పులు.. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మంత్రి

Odisha: ఒడిశాలో ఓ మంత్రిపై కాల్పుల ఘటన కలకలం రేపింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబాదాస్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మంత్రికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించారు. మంత్రి ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకెళ్లినట్లు సమాచారం. ఓ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్‌ నగర్‌లోని గాంధీ చౌక్‌ వద్దకు చేరుకున్న నబకిశోర్‌.. వాహనం దిగుతున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే, దాడికి కారణమేంటనే విషయం తెలియరాలేదు. దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News