Disha Patani: దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల కేసు.. ఎన్​కౌంటర్​లో ఇద్దరు నిందితులు హతం

Disha Patani: ఉత్తరప్రదేశ్ బరేలిలోని బాలీవుడ్ నటి దిశాపటాని ఇంటి వద్ద కొంత మంది రౌడీలు కాల్పులు జరిపారు.

Update: 2025-09-18 05:23 GMT

Disha Patani: ఉత్తరప్రదేశ్ బరేలిలోని బాలీవుడ్ నటి దిశాపటాని ఇంటి వద్ద కొంత మంది రౌడీలు కాల్పులు జరిపారు. ఢిల్లీలోని ఘజియాబాద్‌లో నిందితులను అదుపులోకి తీసుకునే సమయంలో వారు పోలీసులపై కాల్పులు చేశారు. దీంతో పోలీసులు సైతం నిందితులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితులకు గాయాలు కావడంతో వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిందితులిద్దరూ మృతి చెందారని వైద్యులు నిర్దారించారు. 

Tags:    

Similar News