ఆ దేశ పార్లమెంట్​లో అగ్నిప్రమాదం

South Africa: దక్షిణాఫ్రికా పార్లమెంట్‌‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేప్ టౌన్‌లో ఉన్న పార్లమెంట్ భవనాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Update: 2022-01-02 14:30 GMT

ఆ దేశ పార్లమెంట్​లో అగ్నిప్రమాదం

South Africa: దక్షిణాఫ్రికా పార్లమెంట్‌‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేప్ టౌన్‌లో ఉన్న పార్లమెంట్ భవనాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భవనం, పైకప్పు నుంచి మంటలు రావడంతో కొంత దూరం వరకు పొగలు కమ్ముకున్నాయి. మొదటగా భవనంలోని మూడో అంతస్థులో మంటలు వ్యాపించాయి. అనంతరం పాత భవనాల్లో ఒకదాని తర్వాత ఒకదానిలో మంటలు చెలరేగాయి. తర్వాత భవనాల పై భాగానికి మంటలు అంటుకున్నాయి. నేషనల్ అసెంబ్లీ భవనం కూడా మంటల్లో చిక్కుకుంది. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నాయి. సిబ్బంది క్రేన్‌ను ఉపయోగించి కొన్ని చోట్ల మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని వెల్లడించారు.

కేప్ టౌన్‌లోని పార్లమెంట్ హౌస్‌లో మూడు విభాగాలున్నాయి. ఇందులో అత్యంత పురాతన భవనం 1884లో నిర్మితమైంది. అనంతరం 1920, 1980ల్లో మరో రెండింటిని కట్టారు. నేషనల్‌ అసెంబ్లీ ఇందులో ఒకటి. గత ఏడాది ఏప్రిల్‌లోనూ కేప్ టౌన్ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలో అగ్నిప్రమాదం సంభవించి ఆఫ్రికన్ చరిత్రకు సంబంధించిన అరుదైన సేకరణలు మంటల్లో కాలిపోయాయి. ఇంకా ఈ ప్రమాదం నుంచి పూర్తిగా తేరుకొక ముందే ఇప్పుడు పార్లమెంట్‌లోనే ప్రమాదం సంభవించింది.

Tags:    

Similar News