ఇవాళ సాయంత్రం నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయబోతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు దేశం మొత్తం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. కాగా.. రూ.20 లక్షల కోట్లను ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తున్నదీ చెప్పబోతున్నారనేది కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించనున్నారు.
దేశంలో అన్ని వర్గాల ప్రజలకూ ఆ రూ.20 లక్షల కోట్లతో ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయో చెప్పబోతున్నారు. పారిశ్రామిక రంగాన్ని పైకి లేపడానికీ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికీ నిర్మల సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు పన్ను మినహాయింపులు ఇవ్వాలనే డిమాండ్లు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.
ఈసారి ప్యాకేజీ విషయంలో ప్రధాని మోదీ కూడాఎక్కువ ఆసక్తి చూపించనున్నారు. దేశంలోని చిన్న, పెద్ద అన్ని వ్యాపార మండళ్లతో చర్చలు జరిపారు. రెండు వారాలుగా ఇవి సాగాయి. సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ ప్యాకేజీ రూపొందించారు. దేశంలోని చాలా సంస్థలు, వాణిజ్య చాంబర్లు తమ అభిప్రాయాలతో నివేదికలు అందించాయి. ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించిన ప్యాకేజీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆర్థిక ప్యాకేజీపై త్వరలో ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారని అన్నారు. నిజానికి ఈ ప్యాకేజీని కేంద్రం దాదాపు వారం నుంచి రెడీ చేస్తున్నట్లు తెలిసింది. దేశ ఆర్థిక పరిస్థితి పతనం అవుతుండటం, రేటింగ్ సంస్థలు రేటింగ్‌ను పాతాళంలోకి పడిపోవడంతొ కేంద్రం వెసులుబాట్లు, మినహాయింపులూ పెంచడమే కాకుండా భారీ ప్యాకేజీ కూడా ఉండాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.