సరిహద్ధులో సంగ్రామం.. చీకటిపడిన తర్వాత భారీ పేలుళ్లతో దాడులకు తెగబడుతున్న పాక్

Update: 2025-05-10 12:30 GMT

సరిహద్ధులో సంగ్రామం.. చీకటిపడిన తర్వాత భారీ పేలుళ్లతో దాడులకు తెగబడుతున్న పాక్

భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో భీతావహవాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏంజరుగుతోందోననే భయాందోళన నెలకొంది. సరిహద్ధు ప్రాంతాల్లో పాకిస్థాన్ దుర్మార్గానికి ఒడిగట్టింది. పౌరస్థావరాలనే లక్ష్యంగా దుర్మార్గానికి ఒడిగట్టింది. రెండు రోజులుగా చీకటి పడగానే భారీ పేలుళ్లకు పాకిస్థాన్ తెగబడింది. దీంతో సరిహరద్ధు ప్రాంత విమానాశ్రయాలను మూసివేశారు. ఉదంపూర్, పటాన్ కోట్, అదంపూర్, భుజ్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టంచేశారు. రాజౌరీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైన్యం దాడుల్లో జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ దఫ్పా మృత్యువాతపడ్డారు. పాకిస్థాన్‌ డ్రోన్ దాడుల్లో చాలామంది పౌరులు గాయపడ్డారు.

చీకటి పడిన తర్వాత శ్రీనగర్, జమ్ము, అమృత్ సర్ ప్రాంతాలపై దూసుకొస్తున్న భారీ మిస్సైళ్లను భారత్ బలగాలు గుర్తించి విధ్వంసం చేశాయి. సరిహద్దు ప్రాంతాల్లోని పాఠశాలలు, ఆస్పత్రులపై తెగబడే పాకిస్థాన్ ప్రయత్నాలను భారత్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి

చీకటి సమయంలో అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంపై విధ్వంసానికి ఒడిగట్టిన పాక్‌ఎత్తుగడలను భారత్ బలగాలు చిత్తుచేశాయి. రాత్రి సమయంలో డ్రోన్లను గుర్తించిన భారత్ బలగాలు కూల్చవేశాయి. ఈరోజు తెల్లవారుజామున అమృత్ సర్ ఖాసా కంటోన్మెంట్‌ గగన తలంలో భారత బలగాలు శత్రు డ్రోన్‌ ను గుర్తించి కూల్చేశారు. అలాగే శ్రీనగర్‌‌ విమానాశ్రయం‌పైనా డ్రోన్లతో దాడికి పాక్ ప్రయత్నించింది. శ్రీనగర్‌ పరిసరాల్లో డ్రోన్లతో విధ్వంసానికి పాక్‌ ఎత్తుగడ వేసింది. శ్రీనగర్ ఎయిర్ బేస్‌పై డ్రోన్లతో దాడి చేయగా.. భారత్‌ సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. పాకిస్థాన్ డ్రోన్లను కూల్చివేశాయి.

అలాగే చండీఘడ్‌లోనూ ఈరోజు తెల్లవారుజామున పాకిస్థాన్ దాడులకు పాల్పడినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. పఠాన్‌ కోట్ ఏరియాలోనూ భారీ పేలుళ్లు జరిగాయని సైనికాధికారులు గుర్తించారు. జమ్మూనుంచి గుజరాత్‌ వరకు పలుచోట్ల పాక్ దాడులకు పాల్పడగా భారత్ సైనిక బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి.

పాకిస్థాన్ దురాగతాలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిహద్ధుల్లో సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సాయంత్రం తర్వాత సరిహద్ధు ప్రాంతాల్లో జనసమర్థంగా ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు వీల్లేకుండా విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారు. పాకిస్థాన్‌కు అత్యంత సమీపంలో ఉన్న సరిహద్ధు ప్రాంతాల్లో బ్లాక్‌ ఔట్ విధానాన్ని అమలు చేస్తున్నారు.

Tags:    

Similar News