Etela Rajender: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఈటల రాజేందర్ భేటీ
* బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి భేటీ * హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి వస్తానని అమిత్‌షా హామీ
అమిత్‌షా , ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
Etela Rajender: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈటలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ ఉన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, ఆగస్టు 9న ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర గురించి చర్చించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని అమిత్‌షా హామీ ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని అమిత్‌షా సూచించినట్టు ఈటల రాజేందర్ అన్నారు. అందుకోసం తెలంగాణకు ఎన్నిసార్లైన వస్తానన్నారని ఈటల తెలిపారు.