Election Results 2024: ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తలకిందులు.. హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ
Election Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి.
Election Results 2024: ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తలకిందులు.. హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ
Election Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 51 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
అంబాలా లో పార్టీ జెండాలను చేతపట్టుకుని డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. మిఠాయిలు తినిపించుకున్నారు. కొన్ని చోట్ల బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. అనూహ్యంగా కమలం పుంజుకుని ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తోంది.