Election commission new rules: బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కొత్త రూల్స్ ఇవే..

Election commission new rules: కరోనా వైరస్ అన్ని రంగాలపై ఎంత తీవ్రత చూపిస్తుందో మనకు తెలియనిది కాదు..

Update: 2020-07-03 04:02 GMT

Election commission new rules: కరోనా వైరస్ అన్ని రంగాలపై ఎంత తీవ్రత చూపిస్తుందో మనకు తెలియనిది కాదు... దీనివల్ల అన్ని రంగాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడటమే కాదు... ఏపీలో ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకు కారణమయ్యింది. ఇక తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం సైతం భవిషత్తులో జరగనున్న ఎన్నికల్లో కొత్త విధి విధానాలను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా బిజినెస్ లే కాదు… ఎన్నిక‌లు కూడా వాయిదా ప‌డుతున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్య‌స‌భ‌, ఎమ్మెల్సీ ఎన్నిక‌లు మాత్ర‌మే వాయిదా ప‌డ్డాయి. కానీ భారీ ఎత్తున ప్ర‌జ‌లు పాల్గొనే అసెంబ్లీ ఎన్నిక‌ల ప‌రిస్థితి ఏంటీ…? అన్న ప్ర‌శ్న‌ల‌కు చెక్ పెడుతూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇప్పుడున్న స‌మ‌యంలో ఓట‌ర్లు లైన్ల‌లో ఉండ‌కుండా, క‌రోనా వైర‌స్ సోకిన వారు, ఐసోలేష‌న్ లో ఉన్న వారు ఎన్నిక‌ల్లో పాల్గొనేలా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు, అత్య‌వ‌స‌ర సేవ‌ల సిబ్బందికే ఉన్న పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని క‌రోనా బాధితుల‌కు, ఐసోలేష‌న్ లో ఉన్న వారికి సైతం వీలు క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకోగా… కేంద్రం ఈ మేర‌కు గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఈ ఏడాది చివ‌ర్లో బీహ‌ర్ స‌హా కొన్ని రాష్ట్రాల ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మీష‌న్ నిర్ణ‌యం కీల‌కంగా మారింది. కాగా, ఈ పోస్టల్ బ్యాలెట్ విధానంపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.


Tags:    

Similar News