Assembly Polls: హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలకు మోగిన నగారా

Election Commission: హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగింది.

Update: 2022-10-14 11:33 GMT

Assembly Polls: హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలకు మోగిన నగారా

Election Commission: హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. ఒకే దశలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుపుతామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

షెడ్యూల్‌ వివరాలు:

* ఎన్నికల నోటిఫికేషన్‌ : అక్టోబర్‌ 17

* నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్‌ 25

* నామినేషన్ల పరిశీలన : అక్టోబర్‌ 27

* నామినేషన్ల ఉపసంహరణ : అక్టోబర్‌ 29

* పోలింగ్‌ : నవంబర్‌ 12

* ఫలితాలు : డిసెంబర్‌ 8

* మొత్తం నియోజకవర్గాలు : 68

* మొత్తం ఓటర్ల సంఖ్య : 55,07,261 ఓటర్లు

* పురుషులు – 27,80,208

* మహిళలు – 27,27,016

* మొదటిసారి ఓటర్లు – 1,86,681

* 80 ఏళ్లపైబడిన ఓటర్లు – 1,22,087

Tags:    

Similar News