E-pass for Punjab Entry: అక్కడికి వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి..

E-pass for Punjab Entry: కరోనా వైరస్ వ్యాప్తి... ఎక్కడ నుంచి ఎక్కడి వెళ్తుందో..

Update: 2020-07-07 03:24 GMT

E-pass for Punjab Entry: కరోనా వైరస్ వ్యాప్తి... ఎక్కడ నుంచి ఎక్కడి వెళ్తుందో... ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో తెలియని పరిస్థితి. అందుకే వైరస్ వ్యాప్తి తీవ్రత తక్కువగా ఉన్న రాష్ట్రాలు కొంచెం జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఈ వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చితే దానికి అడ్డుకట్ట వేయడం సామాన్య విషయం కాదని గుర్తించాయి. ఈ పరిస్థితుల్లో వీలైనంతవరకు వైరస్ సోకని వారిని రాష్ట్రాల్లోకి అనుమతిస్తే కొంతమేర ఇబ్బంది నుంచి గట్టెక్కవచ్చని భావిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటివరకు ఏపీలోకి వచ్చే వారికి పాస్ ఉంటేనే అనుమతి ఎలా కొనసాగుతుందో... తాజాగా పంజాబ్ రాష్ట్రంలో సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పాస్ చేసుకోవాలని, అదేవిధంగా హోం క్వారెంటైన్ లో ఉండాలని కఠిన నిబంధనలు విధించింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు.

ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పంజాబ్‌ ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. తమ రాష్ట్రానికి వచ్చేవారు ఇకనుంచి కచ్చితంగా ఈ-రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. రిజిస్ట్రేషన్ లేనివారిని రాష్ట్రంలోకి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది. కోవిద్-19 కట్టడికి పంజాబ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కాగా.. ఈ నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కానీ, కోవా పంజాబ్ అనే మొబైల్ అప్లికేషన్‌లో కానీ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, దానిని సంబంధించిన కాపీని ప్రింట్ తీసుకుని వెంట తీసుకురావాలని సూచించింది. ఈ-రిజిస్ట్రేషన్ చేసుకుని రాష్ట్రంలోకి వచ్చినప్పటికీ వారంతా కచ్చితంగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Tags:    

Similar News