ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం విషాదభరితం.. ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం..

Draupadi Murmu: ఒడిశాలోని ఓ సాధారణ ఆదివాసీ గిరిజన మహిళ స్థాయి నుంచి రాష్ట్రమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగారు ద్రౌపది ముర్ము.

Update: 2022-06-22 10:55 GMT

ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం విషాదభరితం.. ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం..

Draupadi Murmu: ఒడిశాలోని ఓ సాధారణ ఆదివాసీ గిరిజన మహిళ స్థాయి నుంచి రాష్ట్రమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగారు ద్రౌపది ముర్ము. ఆమెకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం ద్వారా మహిళకు ఆదివాసీలకు అత్యున్నత స్థానం ఇవ్వడంతో పాటు ఓ మహిళకు దేశ అత్యున్నత పదవి ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ నాయకత్వం భావించింది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన మరియు గిరిజన సంఘం నుండి వచ్చిన ముర్ము ఉపాధ్యాయురాలిగా ప్రారంభించి ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె మయూర్‌భంజ్‌లోని రాయంగ్‌పూర్ నుంచి 2000, 2009లో బిజెపి టిక్కెట్‌పై రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.

అంతకుముందు 1997లో రాయంగ్‌పూర్ నగర్ పంచాయతీకి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. BJP తరపున షెడ్యూల్డ్ తెగల మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తర్వాత, 2000లో రాయంగ్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలోని బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్యకాలంలో వాణిజ్యం, రవాణా శాఖ, ఆ తరువాత ఫిషరీస్, జంతు వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసి ఐదేళ్లు పూర్తికాలం గవర్నర్ పదవిలో కొనసాగారు.

దేశ అత్యున్న‌త స్థానం కోసం పోటీ ప‌డుతున్న ద్రౌప‌ది ముర్ము త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను, విషాదాల‌ను ఎదుర్కొన్నారు. 2009లో అనుమానాస్ప‌ద ప‌రిస్థితుల్లో ఒక కుమారుడు మ‌ర‌ణించాడు. ఈ విషాదం నుంచి తెరుకునే లోపే, 2012లో రోడ్డు ప్ర‌మాదంలో మ‌రో కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. భ‌ర్త శ్యామ్ చ‌ర‌ణ్ ముర్ము గుండెపోటుతో మ‌ర‌ణించారు. భర్త, కొడుకులను కోల్పోయిన ద్రౌపది మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే అన్నీ. కూతురుకు వివాహమై ఒక పాప కూడా ఉంది. తీరిక చిక్కినప్పుడల్లా చిన్నారి మనవరాలితో ఆడుకుంటారు ద్రౌపది ముర్ము. 

Tags:    

Similar News