Nirbhaya Fund: నిర్భయ ఫండ్ గురించి ఈ విషయాలు తెలుసా.. నిధులు ఎలా కేటాయిస్తారంటే..?

Nirbhaya Fund: 16 డిసెంబర్ 2012న ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలను రూపొందించాలని అనేక చర్చలు జరిగాయి.

Update: 2023-03-13 14:30 GMT

Nirbhaya Fund: నిర్భయ ఫండ్ గురించి ఈ విషయాలు తెలుసా.. నిధులు ఎలా కేటాయిస్తారంటే..?

Nirbhaya Fund: 16 డిసెంబర్ 2012న ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలను రూపొందించాలని అనేక చర్చలు జరిగాయి. 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం నిర్భయ నిధిని రూపొందించింది. దీని లక్ష్యం రాష్ట్రాలలో మహిళల భద్రతను బలోపేతం చేయడం. అయితే పారామెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం తర్వాత ప్రారంభించిన 'నిర్భయ ఫండ్' రూ.9 వేల కోట్లలో దాదాపు 30% కూడా సక్రమంగా వినియోగించలేదని తెలుస్తోంది.

నిర్భయ ఫండ్ ప్రారంభమైనప్పటి నుంచి 2021-22 వరకు మొత్తం రూ.6,000 కోట్లకు పైగా నిధులు కేటాయించగా అందులో ఇప్పటి వరకు రూ.4,200 కోట్లు మాత్రమే వినియోగించినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఫండ్‌లోని డబ్బును మహిళలపై అఘాయిత్యాలు, నేరాలను ఎదుర్కోవడానికి వినియోగిస్తారు. బాధిత మహిళలకు రక్షణ కల్పించడమే దీని ఉద్దేశం. ఇప్పటివరకు నిర్భయ ఫండ్‌లో వచ్చిన డబ్బును వన్‌స్టాప్ సెంటర్‌ల ఏర్పాటు నుంచి సేఫ్టీ టూల్స్ నిర్మించడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం, లైంగిక వేధింపుల కేసుల కోసం ఫోరెన్సిక్ కిట్‌లను కొనుగోలు చేయడం వంటి వాటికి ఉపయోగించారు.

'నిర్భయ ఫండ్'కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న స్టేటస్ ప్రకారం ప్రభుత్వం రూ.6212 కోట్లు ఇచ్చింది. ఇందులో మూడింట రెండొంతులు అంటే రూ.4212 కోట్లు మంత్రిత్వ శాఖకు, వివిధ శాఖలకు కేటాయించారు. దీంతోపాటు నిర్భయ ఫండ్‌లో 73% హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఇచ్చారు. నివేదిక ప్రకారం నిర్భయ ఫండ్ నోడల్ అథారిటీ అయిన మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో 20% మాత్రమే ఉపయోగించింది. అదే సమయంలో ఈ నిధి నుంచి ఉత్తరప్రదేశ్ రూ.305 కోట్లు, తమిళనాడు రూ.304 కోట్లు, ఢిల్లీ రూ.413 కోట్లు వినియోగించుకున్నాయి.

Tags:    

Similar News