రైల్వే నిబంధనల ప్రకారం.. ఎంత లగేజీతో ప్రయాణించాలో తెలుసా..?

Indian Railway: రైలులో ప్రయాణించినప్పుడల్లా చాలా మంది చాలా బ్యాగులతో కనిపిస్తారు.

Update: 2022-10-15 15:32 GMT

రైల్వే నిబంధనల ప్రకారం.. ఎంత లగేజీతో ప్రయాణించాలో తెలుసా..?

Indian Railway: రైలులో ప్రయాణించినప్పుడల్లా చాలా మంది చాలా బ్యాగులతో కనిపిస్తారు. వారు తమ లగేజీని బోగీలోని పలు సీట్ల కింద అమర్చుతారు. దీనివల్ల తోటి ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ ఎవ్వరు పట్టించుకోరు. కానీ రైల్వే నిబంధనల ప్రకారం ఇలా చేయడం తప్పు. వాస్తవానికి లగేజీ తీసుకువెళ్లడానికి కొన్ని పరిమితులు, నిబంధనలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

రైలులో స్లీపర్‌ కోచ్‌, టైర్‌-2 కోచ్‌, ఫస్ట్‌క్లాస్‌ కోచ్‌లో లగేజీ తీసుకెళ్లేందుకు నిబంధనలు ఉన్నాయి. మీరు పరిమిత మొత్తంలో మాత్రమే వస్తువులను తీసుకెళ్లాలి. టిక్కెట్‌కు అనుగుణంగా బరువు నిర్ణయిస్తారు. రైల్వే నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి స్లీపర్ కోచ్‌లో 40 కిలోల లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇద్దరు వ్యక్తులు ఉంటే 80 కిలోల వరకు సామాను తీసుకెళ్లవచ్చు. ఈ పరిమితి ప్రయాణీకుల ప్రాతిపదికన ఉంటుంది. అదే సమయంలో టైర్-2 కోచ్‌లో ఒక ప్రయాణీకుడు 50 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు.

అదే సమయంలో ఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణీకులకు ఎక్కువ తగ్గింపు ఉంటుంది. అంటే వారి లగేజీ పరిమితి ఎక్కువ. మొదటి తరగతిలో ప్రయాణించే వ్యక్తులు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. ఎవరైనా పరిమితికి మించి ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి రూ.600 కంటే ఎక్కువ జరిమానా చెల్లించాలి. దూరం ఆధారంగా ఈ పెనాల్టీ ఉంటుంది. ఎక్కువ లగేజీ ఉంటే లగేజీ కంపార్ట్‌మెంట్‌లో జమ చేయాలి.

Tags:    

Similar News