DK Shiva Kumar: పార్టీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాను.. కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చాను
DK Shiva Kumar: నా బర్త్ డే వేడుకల్లో సిద్ద రామయ్య పాల్గొన్నారు
DK Shiva Kumar: పార్టీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాను.. కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చాను
DK Shiva Kumar: మద్దతుదారులతో భేటీ తర్వాత డీకే శివకుమార్ ప్రెస్ మీట్ మీట్ నిర్వహించారు. పార్టీ కోసం ఎంతో కష్ట పడ్డానని శివకుమార్ చెప్పారు.పార్టీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చానన్నారు. తన అధ్యక్షతన 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానన్నారు. కాంగ్రెస్ నేతలంతా గెలుపు కోసం సహకరించారని... తన మద్దతుదారుల సంఖ్యను చెప్పనని తెలిపారు. సీఎం ఎవరనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుందని శివకుమార్ అన్నారు. సిద్ద రామయ్యతో ఎలాంటి విభేదాలు లేవని.. తన బర్త్ డే వేడుకల్లో సిద్ద రామయ్య పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. సోనియా, రాహుల్, ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. తన గురువును ఢిల్లీలో కలుస్తానన్నారు.