Delhi: పటాకులు కొనుగోలు చేసినా.. విక్రయించినా పోలీస్ కేసులు

Delhi: దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చకుండా ఢిల్లీ పోలీసులు, అధికారులు 24 గంటల పాటు గట్టి నిఘా పెట్టారు.

Update: 2021-11-03 03:39 GMT

Delhi: పటాకులు కొనుగోలు చేసినా.. విక్రయించినా పోలీస్ కేసులు

Delhi: దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చకుండా ఢిల్లీ పోలీసులు, అధికారులు 24 గంటల పాటు గట్టి నిఘా పెట్టారు. దీపావళి సందర్భంగా పటాకులు విక్రయించినా, కొనుగోలు చేసినా వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశించారు. బాణసంచా ఢిల్లీలోకి రాకుండా సరిహద్దులపై పోలీసులు నిఘా వేశారు. యాంటీ క్రాకర్స్ క్యాంపెయిన్ కింద ఇప్పటి వరకు 12వేల, 957 కిలోల క్రాకర్స్‌ను స్వాధీనం చేసుకొని, 32 మందిపై కేసులు నమోదు చేశామని మంత్రి వెల్లడించారు.

దీపావళి సందర్భంగా అక్టోబర్ 27న క్రాకర్స్‌ కాల్చడంపై అవగాహన కల్పించేందుకు 'పటాఖే నహీ జలావో' పేరిట మంత్రి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో ఎవరైనా క్రాకర్లు కాల్చినా.. వారిపై సంబంధిత ఐపీసీ నిబంధనలు, పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు, పటాకుల అమ్మకాలు, కొనుగోళ్లను నిరోధించేందుకు నగర పాలక సంస్థ జిల్లా స్థాయిలో 15 బృందాలను ఏర్పాటు చేశారు.

దేశ రాజధానిలోని మొత్తం 157 పోలీస్ స్టేషన్‌లలో ఇద్దరు సభ్యుల బృందం ఉంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెప్టెంబరు 15న పటాకులు కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 28 న ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ జనవరి 1, 2022 వరకు దేశ రాజధానిలో బాణాసంచా అమ్మకాలు, పేల్చడంపై పూర్తిగా నిషేధం విధించింది.

Tags:    

Similar News