Boiled Rice: బాయిల్డ్ రైస్‌ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డైలాగ్ వార్

Boiled Rice: రాష్ట్రాల్లో అవసరానికి సరిపడా బియ్యం ఉంచుకొని మిగులు బియ్యం ఎఫ్‌సీఐకి పంపాలని ఒప్పందం ఉంది

Update: 2021-09-14 13:30 GMT

 బాయిల్డ్ రైస్‌ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డైలాగ్ వార్(ఫోటో-ది హన్స్ ఇండియా)

Boiled Rice: బాయిల్డ్ రైస్‌ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. గతంలో ఉన్న ఒప్పందానికి ఇప్పుడు కేంద్రం తూట్లు పొడుస్తుందని మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాల్లో అవసరానికి సరిపడా బియ్యం ఉంచుకుని మిగులు బియ్యం FCIకి పంపాలని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ ఒప్పందం ఉందని గుర్తు చేశారు. 2019- 2020 యాసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 2020 -2021 ఏడాదిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని గంగుల తెలిపారు ఇందులో కేంద్రం 25 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకుంటాం అంటుందని మిగతా 37 బియ్యం ఎవరు కొంటారని ప్రశ్నించారు.

Tags:    

Similar News