Delhi New CM: 20న ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం?
Delhi New CM Oath: ఢిల్లీ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు బీజేఎల్పీ మీటింగ్ జరగనుంది.
Delhi New CM: 20న ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం?
Delhi New CM Oath: ఢిల్లీ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు బీజేఎల్పీ మీటింగ్ జరగనుంది. మరుసటి రోజు అంటే ఎల్లుండి ఢిల్లీ కొత్త సీఎంను బీజేపీ అధిష్టానం ఎంపిక చేయనుంది.
బీజేపీ ఎమ్మెల్యేల నుంచే ఒకరిని సీఎంగా ఎన్నుకోనున్నారు. 15 ఎమ్మెల్యేల పేర్లపై వడపోతలు జరగగా...తుది జాబితాలో 9 మంది ఉన్నారు. అందులోనే సీఎం, మంత్రులను ఉండనున్నారు. ఢిల్లీ కేబినెట్లో సీఎం సహా ఏడుగురికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఢిల్లీ పరిధిలో 7లోక్సభ స్థానాలు ఉండటంతో...ఒక్కో స్థానం నుంచి ఒక్కరికి అమాత్యపదవి దక్కనుంది. ఎస్సీ, జాట్లకు అవకాశం సీఎం అవకాశం వస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. జాట్లకు సీఎం ఇచ్చి రైతు ఉద్యమాన్ని శాంతింపచేసేలా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఒకవేళ జాట్లకే ప్రాధాన్యం ఇస్తే పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు.
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా 20 రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఫలితాల వచ్చిన 12 రోజులకు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి రాంలీలా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణానికి 12 నుంచి 16 వేల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు.