Minister Atishi: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఢిల్లీ మంత్రి అతిషి
Minister Atishi: ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ దీక్ష... 4రోజులుగా నిరాహార దీక్ష చేయడంతో క్షీణించిన ఆరోగ్యం
Minister Atishi: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఢిల్లీ మంత్రి అతిషి
Minister Atishi: ఢిల్లీలో నీటి సమస్యపై దీక్ష చేపట్టి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ మంత్రి అతిషి డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజులపాటు చికిత్స తీసుకున్న ఆమె ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ ఈనెల 21న అతిషి నిరాహార దీక్ష చేపట్టారు. హర్యానా నీటిని విడుదల చేసే వరకు ఆమరణ నిరవధిక దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ దీక్ష నేపథ్యంలో నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోయాయి. దీంతో ఆమెను ఈనెల 25న లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్‌కు తరలించారు. ఆరోగ్యం కుదుటపడటంతో రెండు రోజుల చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు.