Delhi Metro: ఢిల్లీలో 7 న మెట్రో పునఃప్రారంభం, మాస్క్ తప్పనిసరి!

Delhi Metro: కరోనా వలన గత అయిదు నెలలుగా మెట్రో సేవలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా అన్‌లాక్‌-4 లో

Update: 2020-08-30 12:21 GMT

Metro 

Delhi Metro: కరోనా వలన గత అయిదు నెలలుగా మెట్రో సేవలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా అన్‌లాక్‌-4 లో భాగంగా సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రో సేవలకి అనుమతి ఇస్తున్నట్టుగా కేంద్రం వెల్లడించింది.. అయితే దేశ రాజధానిలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో మెట్రో పునఃప్రారంభం అవ్వడం అనేది ఏమేరకు ప్రభావం చూపుతుందోనని పలు అనుమానాలు మొదలయ్యాయి.. ఇక ఇది ఇలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు గాను మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక మెట్రో సర్వీసుల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గహ్లోత్‌ వెల్లడించారు.

సామాజిక దూరం, థర్మల్‌ స్క్రీనింగ్‌, మాస్కులు ధరించడం తప్పనిసరి చేశామని ఆయన అన్నారు. ప్రయాణికులకి ఎంట్రీ వద్దనే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి లోనికి అనుమతిస్తామని వెల్లడించారు.. ఇక గతంలో మాదిరిగా ప్రయాణికులకు టోకెన్స్‌ జారీ చేయమని వెల్లడించారు. అటు లిఫ్టుల్లో కూడా తక్కువ సంఖ్యలో ప్రయాణికులు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్మార్ట్‌ కార్డులు, ఇతర డిజిటల్‌ పద్ధతుల్లో మాత్రమే పేమెంట్లు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇక కరోనా వలన మెట్రో సేవలను ఆపేయడం వలన రూ.1300 కోట్ల నష్టం వచ్చినట్టుగా తెలుస్తోంది..

Tags:    

Similar News