Delhi's Next CM?: ఢిల్లీ సీఎం పదవికి అతిషి రాజీనామా... కొత్త సీఎం పేరు ఎప్పుడు చెబుతారంటే...
Delhi's Next CM?: ఢిల్లీ సీఎం పదవికి అతిషి రాజీనామా... కొత్త సీఎం ఎంపిక ఎప్పుడంటే...
Delhi CM Atishi resigns: ఢిల్లీ సీఎం అతిషి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం అతిషి రాజ్ నివాస్‌కు వెళ్లి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సెనాకు తన రాజీనామా లేఖను అందించారు. అతిషి మార్లెనా గత ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవడంతో ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపాలైంది. ఆ పార్టీకి కేవలం 22 స్థానాలే వచ్చాయి. ఇక 27 ఏళ్లుగా అధికారానికి దూరమైన బీజేపి ఈ ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకుని త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఢల్లీ రాజకీయాలను గమనిస్తున్న వారి ముందు నిన్నటివరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది ఒక ప్రశ్నగా ఉండింది. కానీ నిన్నటి ఎన్నికల ఫలితాల్లో బీజేపి విజయం సాధించడంతో ఆ ప్రశ్నకు జవాబు లభించింది. ఇక ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఒక్కటే. .. ఢిల్లీకి కాబోయే కొత్త సీఎం ఎవరు అని. ఇప్పటికే ఈ జాబితాలో నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
అయితే, ఇప్పటికే ఈ విషయంలో బీజేపి హై కమాండ్ ఒక స్పష్టమైన నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే పార్టీ ఎవరికి ఆ ఛాన్స్ ఇస్తుందనే విషయంలో వెంటనే క్లారిటీ ఇచ్చేందుకు బీజేపి సిద్ధంగా లేదని తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సదస్సు కోసం ఫ్రాన్స్ వెళ్లనున్నారు. ఈ విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన అనంతరం ఢిల్లీ సీఎంను ఎంపిక చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.