ఏపీ సీఎం జగన్ మాట కేజ్రీవాల్ నోట

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటను వల్లించారు.

Update: 2020-05-03 14:59 GMT
YS Jagan, Arvind Kejriwal (File Photo)

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటను వల్లించారు. ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌తో మనం కలసి జీవించాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. సీఎం జగన్ మాటలను తప్పుపట్టారు. కరోనా వైరస్ కట్టడి చేయడంలో సీఎం విఫలమైయ్యారని ప్రతిపక్షలు విమర్శలు గుప్పించాయి. నెటిజన్లు సీఎం జగన్‌ను ట్రోల్ చేశారు. అయితే, తాజాగా కేజ్రీవాల్ కూడా అదేమాట చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి లాక్ డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ఢిల్లీ ద్వారాలు తెరుచుకోవాల్సిన సమయం వచ్చిందని, కరోనా వైరస్‌తో కలసి జీవించడానికి సిద్ధం కావాలి. అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఎక్కువకాలం లాక్ డౌన్ మీదే గడపలేం. 2019లో ఏప్రిల్ లో ఢిల్లీకి 3600 కోట్ల రూపాయల ఆదాయం వస్తే, ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో కేవలం 300 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని అన్నారు. మార్చ్ నెల 24న లాక్ డౌన్ విధించకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని, అప్పుడు కరోనా మీద పోరాడేందుకు దేశం సన్నద్ధంగా లేదని కేజ్రీవాల్ తెలిపారు.




Tags:    

Similar News