తబళా కళాకారుడిగా మారిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

CM Arvind Kejriwal: ప్రభుత్వ పాఠశాలలో హ్యాపినెస్ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్

Update: 2022-07-30 02:43 GMT

తబళా కళాకారుడిగా మారిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తబళా కళాకారుడిగా మారిపోయారు. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లలో నిర్వహించిన హ్యాపినెస్ ఉత్సవ్ ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేజ్రీవాల్ తబలా వాయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సీఎం కేజ్రీవాల్‌లో ఇంత టాలెంట్ ఉందా అని కార్యక్రమానికి హాజరైన స్టూడెంట్స్, ఇతరులు ఆశ్చర్యపోయారు. తనకు తబలా వాయించడం వచ్చని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వాయిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఎన్నివేల కోట్లు ఖర్చయినా ఫర్వాలేదన్నారు మోడీ. విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తుంటే మోడీ ప్రభుత్వం మాత్రం ఉచితాలంటూ ఎద్దేవా చేస్తున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News