Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు
Delhi Bomb Blast: ఢిల్లీలో భారీ బాంబు పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు
Delhi Bomb Blast: ఢిల్లీలో భారీ బాంబు పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ చేసిన ఓ i-20 కారులో బాంబు అమర్చినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
నిన్న సాయంత్రం 6 గంటల 52 గంటలకు జరిగిన పేలుడు ఘటనకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి ఐ-20 కారు నడుపుతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. అతడు డాక్టర్ మహ్మద్ ఉమర్‌గా గుర్తించారు. ఫరీదాబాద్ మాడ్యూల్‌తో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. రషీద్, మీర్, మాలిక్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.