Rahul Gandhi: నేడు రాహుల్‌ పరువు నష్టం కేసులో గుజరాత్‌ హైకోర్టు తీర్పు

Rahul Gandhi: సూరత్‌ ట్రయల్‌ కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాహుల్‌ పిటిషన్‌

Update: 2023-07-07 03:02 GMT

Rahul Gandhi: నేడు రాహుల్‌ పరువు నష్టం కేసులో గుజరాత్‌ హైకోర్టు తీర్పు

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ సమయంలో రెండు దిగువ కోర్టుల నుంచి రాహుల్‌కు ఈ కేసులో ఉపశమనం లభించకపోవడంతో అందరి చూపు హైకోర్టు తీర్పుపైనే ఉంది. నిజానికి రాహుల్‌కు పరువు నష్టం కేసులో సూరత్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో 2 ఏళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత ఆయన పార్లమెంటరీ సభ్యత్వం కూడా రద్దయింది.

రాహుల్ గాంధీపై గుజరాత్ ఎమ్మెల్యే పురునేష్ మోదీ పరువు నష్టం కేసు పెట్టారు. కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రకటన చేశారని ఆరోపించారు. ఈ కేసులో విచారణ సందర్భంగా మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ అదనపు సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు.

అయితే అదనపు కోర్టు నుంచి కూడా రాహుల్ గాంధీకి ఎలాంటి ఉపశమనం లభించలేదు. అదనపు సెషన్స్ కోర్టు కూడా రాహుల్ గాంధీకి విధించిన శిక్షను సమర్థించింది. దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తీర్పును జులై 7న వెల్లడించాలని కోర్టు కోరింది.

Tags:    

Similar News