Fake Certificate: బతికి ఉన్న మహిళ... రికార్డుల్లో చనిపోయినట్లు సర్టిఫికెట్

Fake Certificate: తమిళనాడు గుడియాత్తం మున్సిపల్ రికార్డులో తప్పిదాలు

Update: 2023-07-22 01:56 GMT

Fake Certificate: బతికి ఉన్న మహిళ... రికార్డుల్లో చనిపోయినట్లు సర్టిఫికెట్

Fake Certificate: ప్రభుత్వ రికార్డుల నిర్వహణలో తప్పిదాలతో... ఆమహిళ అవాక్కైంది. వాస్తవాలు తెలుసుకుని నిర్ఘాంతపోయింది. బతికున్నోళ్లను చంపేసి.. చనిపోయినోళ్లను బతికించి.. కోటి రూపాయల ఆస్తి కొట్టేశారు. ఆ మహిళ జీవించే ఉంది. కానీ ‘అధికారిక’ లెక్కల్లో చంపేశారు. సర్టిఫికెట్‌కూడా ఇచ్చేశారు. తమిళనాడు గుడియాత్తం మున్సిపాలిటీ నుంచి డెత్‌ సర్టిఫికెట్‌ ఆస్తిపాస్తుల లావాదేవీలకు కీలకమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధిత మహిళ అవాక్కైంది.

ఇదే మహిళ భర్త రవివర్మ చనిపోయి రెండేళ్లయింది. రికార్డుల్లో ఆయనకు జీవం పోశారు. ‘ఆధార్‌’ సహా అన్ని పత్రాల్లోనూ ఆయన్ను బతికించేశారు. ఆమె పేరిట ఉన్న రూ. కోటి ఆస్తి కొట్టేయడానికి. అలా తొమ్మిది నెలల కిందట కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ అయిపోయి అనాయాసంగా చేతులు మారిపోయిందా ఆస్తి. ఈ విషయం ఆలస్యంగా తెలిసి కాంచన బుధవారం కుప్పానికి వచ్చి అధికారులను నిలదీయడంతో మోసం వెలుగు చూసింది.

తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా ఆంబూరు తాలూకా గాంధీనగర్‌లోని ఫాతిమా నగర్‌లో రవివర్మ, కాంచన దంపతులు నివాసం ఉండేవారు. 2021 మే 24న రవివర్మ కరోనాతో మృతి చెం దారు. ఈ మేరకు చెన్నైలోని రాజీవ్‌గాంధీ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది. కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మం డలం బెగ్గిలపల్లె పంచాయతీ లో 1962 చదరపు అడుగుల విస్తీర్ణం గల మూడు బిట్లుగా ఉన్న ఖాళీ జాగా కాంచన పేరున ఉంది. చిన్న ఇల్లు కూడా ఉన్న ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో కోటి రూపాయలు పలుకుతోంది. ఈ స్థలంపై గాంధీనగర్‌లోని ఆర్‌.గౌస్‌పాషా కన్ను పడింది.

నకిలీ రిజిస్ట్రేషన్‌తో ఈ స్థలాన్ని సొంతం చేసుకోవాలని భావించాడు. దీనికోసం చనిపోయిన కాంచన భర్త రవివర్మ.. బతికే ఉన్నట్లుగా ఆధార్‌కార్డు సహా అన్నిరకాల పత్రాలు సృష్టించాడు. కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సంప్రదించాడు. ఆ స్థలం ఆయన భార్య పేరుతో ఉన్నది కాబట్టి, భర్త ద్వారా రిజిస్టర్‌ చేయలేమని ఇక్కడి సిబ్బంది చెప్పారు. ఆలస్యంగా ఈ మోసం తెలుసుకున్న కాంచన న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. తప్పుడు ధృవపత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న గౌస్‌ పాషా మరో ఇద్దరికి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసిచ్చారని అధికారుల విచారణలో వెల్లడైంది. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News